Current Affairs Telugu Daily

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై అధ్యయనానికి కమిటీ 
జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి ముగ్గురు మాజీ అఖిల భారత సర్వీసు అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేశాం. అది ఇచ్చే నివేదిక ఆధారంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం...’’ అని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ప్రకటించారు. తాజాగా నెలకొన్న సంఘటనల దృష్ట్యా అభ్యర్థుల భద్రతకు అధిక సంఖ్యలో భద్రతా బలగాలు అవసరం అవుతాయని, అవి అందుబాటులో లేని కారణంగానే అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేశామని ఆయన వెల్లడించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర హోంశాఖతో సమాలోచనలు జరిపాం. కమిషన్‌కు ఈ రెండు పూర్తి స్థాయిలో నివేదికలు పంపాయి. వివిధ దశల్లో సమీక్షలు నిర్వహించాం. రాష్ట్ర యంత్రాంగం, హోం శాఖ, రాజకీయపార్టీలతో మాట్లాడిన తర్వాత భద్రతా బలగాల లభ్యత, ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు, అభ్యర్థులకు కల్పించాల్సిన భద్రత, ఇతరత్రా సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ స్థాయిలో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులను పూర్తి స్థాయిలో నిరంతరం సమీక్షించి అసెంబ్లీ ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఇందుకోసం మరింత సూక్ష్మంగా పరిశీలించడానికి... 
*1977వ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నూర్‌ మహమ్మద్‌,  
*1972వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి, మాజీ సీఆర్‌పీఎఫ్‌ డీజీ ఏఎస్‌ గిల్‌, గతంలో ఎన్నికల సంఘంలో ఆరేడేళ్లు పనిచేసి పదవీ విరమణ చేసిన 1982వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వినోద్‌జుత్సితో కమిటీ వేశాం.  వారు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారు...’’ అని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా వివరించారు.

views: 838

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams