Current Affairs Telugu Daily

స్వచ్స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు 2019

దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్‌ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. 2019 సంవత్సరానికి గానూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం విజ్ఞాన్‌భవన్‌లో ప్రదానం చేశారు.

స్వచ్ఛ నగరాల జాబితా కోసం జనవరి 4 నుంచి 31 వరకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టింది. ఈ జాబితాలో ఇండోర్‌ అగ్రస్థానంలో నిలిచింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2019 అవార్డుల వివరాలు ఇలా..

* అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఇండోర్‌

* అత్యంత స్వచ్ఛమైన రాజధానిగా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌

* స్వచ్ఛత కోసం పాటుపడుతున్న టాప్‌ 3 రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర

* 10లక్షల కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో స్వచ్ఛమైన నగరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌

*3-10లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం ఉజ్జయిని

* 1-3లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం న్యూదిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌


views: 760

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams