Current Affairs Telugu Daily

ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రత్యేక చట్టమెందుకు లేదు : సుప్రీం 
ఎన్నికల కమిషనర్లను నియమించడానికి రాజ్యాంగం ప్రకారం ఎందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను కమిషనర్లు నిర్వహిస్తుంటారని, ఇంత ప్రాధాన్యమున్న పదవుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. ప్రధాన కమిషనర్‌, కమిషనర్ల నియామకానికి రాజ్యాంగంలోని 324(2) అధికరణం ప్రకారం ప్రత్యేకంగా చట్టం చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై అనూప్‌ పరన్వాల్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై 2017 జులై 5న విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పారదర్శకత పాటించేందుకు ఎన్నిక కమిషనర్ల ఎంపిక ప్రక్రియను రూపొందించడంతో పాటు, మార్గదర్శకాలను ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది.
views: 1080

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams