Current Affairs Telugu Daily

పుల్వామాలో హిందూ ఆలయ పునరుద్ధరణకు ముస్లింల శ్రీకారం
ఉగ్రదాడితో భీతిల్లిన పుల్వామాలో మత సామరస్యాన్ని చాటుతూ ఓ హిందూ ఆలయ పునరుద్ధరణకు ముస్లింలు శ్రీకారం. 80ఏళ్ల నాటి ఈ ఆలయం రెండున్నర దశాబ్దాలుగా మూతబడిపోగా తిరిగి ప్రారంభించేందుకు పనులు చేపట్టారు.
ఇటీవల ఉగ్రదాడి జరిగిన ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో దాదాపు 40 కశ్మీరీ పండిత్‌ కుటుంబాలుండేవి. 1990వ దశకంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో వారంతా వలసవెళ్లారు. అప్పటినుంచి ఈ ఆలయం మూతపడి ఉంది.
ఈ నేపథ్యంలో ప్రార్థనలకు అనుగుణంగా ఆలయాన్ని పునరుద్ధరిస్తే ప్రజలు తరలివస్తారన్న లక్ష్యంతో కొన్ని ముస్లిం కుటుంబాలు ముందుకొచ్చాయి. మరో పండిత్‌ కుటుంబం సహాయంతో వారంతా పనులు ప్రారంభించారు. దీనికయ్యే పూర్తి ఖర్చును స్థానిక ముస్లిం ట్రస్ట్‌ భరిస్తోంది. 

views: 700

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams