Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్‌ మద్దతు 
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్‌ పునరుద్ఘాటించింది. సమితి సంస్కరణల్లో భాగంగా శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాలను విస్తరించడం ‘మొదటి కీలక అధ్యాయం’గా పేర్కొంది.
ఏప్రిల్‌ నుంచి 15 సభ్యదేశాల భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న జర్మనీ రాయబారి క్రిస్టోఫర్‌ హ్యూస్‌జెన్‌తో ఫ్రాన్స్‌ రాయబారి ఫ్రాంకోయిస్‌ డెలాట్రే మాట్లాడారు.
ఇందులో భారత్‌, జర్మనీ, జపాన్‌లకు ఫ్రాన్స్‌ మద్దతు తెలిపింది. సమితిని విస్తరించి, ఆఫ్రికా దేశాలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఫ్రాంకోయిస్‌ అభిప్రాయపడ్డారు.
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ‘జైషే మహ్మద్‌’ తీవ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ అమెరికా, బ్రిటన్‌తో కలసి ‘యూఎన్‌ఎస్‌సీ’లో ఫ్రాన్స్‌ ఇటీవల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

views: 859

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams