Current Affairs Telugu Daily

ప్లాస్టిక్‌ ప్రచార సామగ్రిని వాడొద్దు
ప్రజారోగ్యం, పర్యావరణ ముప్పును దృష్టిలో ఉంచుకొని సార్వత్రిక ఎన్నికల్లో పర్యావరణహిత ప్రచార సామాగ్రిని మాత్రమే వాడాలని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది.
దీన్ని ఉల్లంఘిస్తే.. ప్లాస్టిక్‌ను శుద్ధిచేయడానికి అయ్యే ఖర్చును రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ కార్యదర్శి భూటియా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాశారు.
ప్రస్తుతం ప్రచార సామాగ్రినంతా ప్లాస్టిక్‌తో రూపొందిస్తున్నారు. ఎన్నికలయ్యాక అదంతా వ్యర్థంగా మారుతోంది. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఎక్కడికక్కడే వదిలేయడం వల్ల డ్రైనేజీలు, నదీ ప్రవాహాలు మూసుకుపోతున్నాయి. మూగజీవాలు తిని మరణిస్తున్నాయి. బహిరంగ ప్రాంతాల్లో వీటిని కాల్చేయడం వల్ల కాలుష్యం విస్తరిస్తోంది. పర్యవసానంగా ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
కొన్ని పార్టీలు ఉపయోగిస్తున్న పీవీసీ ప్లాస్టిక్‌ను కాల్చేసేటప్పుడు విషవాయులు వెలువడుతున్నాయి. ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయంగా వస్త్రం, పేపరు వంటి వాటిని వినియోగించాలి. పార్టీలన్నీ ఇలాంటి సామాగ్రి వినియోగాన్ని ప్రోత్సహించాలి.
ప్రచారంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి సుస్థిరమైన పద్ధతులను ప్రోత్సాహించడానికి వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఓ అత్యుత్తమ వేదిక. పారేసిన ప్రచార సామాగ్రిని శుభ్రంచేసే అంశంలో ఇకపై ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016తోపాటు, ఇతరత్రా చట్టాలను అమలు చేస్తారు.

views: 747

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams