Current Affairs Telugu Daily

డాన్‌ కొలోవ్‌-నికోలా పెట్రో టోర్నీలో పురుషుల 65 కిలోల విభాగంలో చాంపియన్‌గా భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా 
భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా బల్గేరియాలోని రూసెలో జరిగిన డాన్‌ కొలోవ్‌-నికోలా పెట్రో టోర్నీలో పురుషుల 65 కిలోల విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. మర్చి 3న జరిగిన ఫైనల్లో ఫేవరెట్‌గా పోటీపడ్డ బజరంగ్‌ 12-2తో జొర్డాన్‌ ఒలివర్‌ (అమెరికా)ను చిత్తుచేసి పసిడి పట్టు పట్టాడు. 0-3తో వెనుకంజలో నిలిచిన బజరంగ్‌ ఆపై అద్భుతంగా పుంజుకొని వరుసగా 12 పాయింట్లు చేజిక్కించుకొని ప్రత్యర్థిని మట్టికరిపించా డు.
కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో చాంపియన్‌గా నిలిచిన బజరంగ్‌ గత ఐదు టోర్నీల్లో నాలుగు స్వర్ణాలు, ఒక రజత పతకం గెలవడం విశేషం.
*మహిళల 53 కేజీల విభాగంలో భారత స్టార్‌ వినేష్‌ ఫోగట్‌ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
*ఈ చాంపియన్‌షిప్ లో పూజా ధండా 59 కేజీల కేటగిరీలో పసిడి పతకం, 65 కిలోలలో సాక్షి మాలిక్‌ రజతం. పురుషుల 61 కేజీలలో సందీప్‌ టోమర్‌ రజత పతకం గెలుపొందాడు.

views: 934



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams