Current Affairs Telugu Daily

రెండేళ్ల పాటు భారత్‌ వృద్ధి 7.3% :మూడీస్‌  
భారత ఆర్థిక వ్యవస్థ 2019, 2020 సంవత్సరాల్లో 7.3 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని అమెరికాకు చెందిన రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి చేసినప్రకటనలు సమీప భవిష్యత్‌లో వృద్ధికి దోహదపడనున్నట్టు తెలిపింది.
2019-20 మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా రైతులకు నేరుగా నగదు బదిలీ చేయడంతోపాటు మధ్య తరగతి వర్గాలకు పన్ను భారం తగ్గించే ప్రకటనలు చేసినందు వల్ల ఆర్థిక పరంగా ఊతం లభిస్తుందని, దీంతో జీడీపీ 0.45 శాతం వృద్ధికి అవకాశం ఉంటుందని మూడీస్‌ పేర్కొంది
  • Moody's  Headquarters: New York City, New York, United States
  • CEO: Raymond W. McDaniel Jr.

views: 823

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams