Current Affairs Telugu Daily

హురియత్‌ కాన్ఫరెన్స్‌పైనా నిషేధం
ఉగ్రవాదానికి ఊతమిస్తున్న జమ్మూ-కశ్మీర్‌లోని ‘జమాతే ఇస్లామీ (జేఈఎల్‌) హింద్‌’పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం, వేర్పాటువాద కూటమి హురియత్‌ కాన్ఫరెన్స్‌పైనా అదే నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఈమేరకు హురియత్‌ కాన్ఫరెన్స్‌పై నిఘాసంస్థలు కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరు అత్యంత కీలక దశకు చేరుకుందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
*హురియత్‌ కాన్ఫరెన్స్‌ వేర్పాటువాద ధోరణితో పాటు, ఉగ్రవాదానికి ఊతమిస్తుండటం వల్లే దానిపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ‘‘పాక్‌ మద్దతుతో అఖిల పక్ష హురియత్‌ కాన్ఫరెన్స్‌ (ఏపీహెచ్‌సీ) వెనుక జేఈఎల్‌ (జమ్మూ-కశ్మీర్‌) హస్తం ఉంది.
*అది పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదానికి సిద్ధాంతపరమైన మద్దతిస్తోంది.’’ అని ఓ అధికారిక పత్రం పేర్కొంది. కాగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద జేఈఎల్‌ (జమ్మూ-కశ్మీర్‌)పై కేంద్రం ఐదేళ్ల నిషేధం విధించింది. ఏపీహెచ్‌ఎస్‌ అనేది 26 రాజకీయ, సామాజిక, మత సంస్థల కూటమిగా 1993 మార్చి 9న ఏర్పడింది. కశ్మీరీ వేర్పాటువాదంతో ఉమ్మడి రాజకీయ ఫ్రంట్‌గా తయారైంది.

views: 685

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams