Current Affairs Telugu Daily

భారత్‌పైకి ఎఫ్‌-16లను పాక్‌ ప్రయోగించడం అమెరికాతో కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘించడమే
మనదేశ సైనిక స్థావరాలపై ఫిబ్రవరి 27న దాడికి యత్నించి భంగపడ్డ పాకిస్థాన్‌ ఈ కుట్రలో ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వినియోగించిన సంగతిని దాస్తోంది. పాక్‌ ప్రయోగించిన ఓ ‘ఎఫ్‌-16’ను కూల్చివేసినట్లు భారత అధికారులు చేసిన ప్రకటనను తోసిపుచ్చుతోంది.
తాము అసలు ఆ విమానాలను వాడలేదని బుకాయిస్తోంది. కానీ, పాక్‌ వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో ఎఫ్‌-16 మాత్రమే ప్రయోగించగల అమ్రామ్‌ క్షిపణి శకలాలను భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఫిబ్రవరి 28న మీడియా ముందు ప్రదర్శించడంతో పాక్‌ బుకాయింపు బట్టబయలైంది. అయితే, ఎఫ్‌-16ల వాడకాన్ని పాక్‌ అంగీకరించకపోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. 
*ఈ యుద్ధ విమానాలను అమెరికా నుంచి పాక్‌ కొనుగోలు చేసింది.
*ఉగ్రవాదంపై పోరాడేందుకు, విద్రోహశక్తులను అణిచివేసేందుకు మాత్రమే వాటిని ఉపయోగిస్తామని కొనుగోలు సమయంలో ఒప్పందంపై సంతకం చేసింది. ఉద్రిక్తతలు పెంచేలా ఏ దేశంపైకీ ప్రయోగించబోమని హామీ ఇచ్చింది. అందుకు విరుద్ధంగా ఇప్పుడు మనదేశంపైకి ఎఫ్‌-16లను పంపించింది. అంటే అమెరికాకు ఇచ్చిన హామీని విస్మరించినట్లే.

views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams