Current Affairs Telugu Daily

ఓటరు చీటీ ఒక్కటే సరిపోదుః ఎన్నికల సంఘం

న్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు చీటీ ఒక్కటే సరిపోదని, దాంతోపాటు నిర్దేశించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని చూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.ఎన్నికల సందర్భంగా ఓటరు పేరు, ఫొటోతో ఇచ్చే చీటీని గుర్తింపు పత్రంగా ఆమోదించబోమని స్పష్టం చేసింది. దుర్వినియోగమయ్యే అవకాశం ఉండడంతో ఈ చీటీలను గుర్తింపు పత్రాలుగా పరిగణించకూడదని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకొంది.

  • 12  గుర్తింపు కార్డులుః
ఓటరు గుర్తింపు కార్డు;పాస్‌పోర్టు; డ్రైవింగ్‌ లైసెన్సు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డులు; బ్యాంకు/పోస్ట్‌ ఆఫీసు జారీచేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్కు, పాన్‌కార్డు, జాతీయ జనాభా రిజిస్ట్రార్‌ జారీచేసిన స్మార్ట్‌కార్డు; ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు; కార్మికశాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్‌కార్డు; ఫొటో కూడిన పెన్షన్‌ పత్రం; ఎంపీ/ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలు జారీచేసిన అధికారిక గుర్తింపుకార్డు; ఆధార్‌కార్డు

views: 886

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams