Current Affairs Telugu Daily

నటి శారదకు ‘కలైమామణి’ పురస్కారం
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘కలైమామణి’ పురస్కారాలను ప్రకటించింది. 2011 నుంచి 2018 వరకు ఎనిమిదేళ్లకు సంబంధించి సినిమా, నాటకం, సంగీతం, నాట్యం, బుల్లితెర, సాహిత్యంతో పాటు వివిధ రంగాలకు చెందిన మొత్తం 201 మందికి సంబంధిత అవార్డులను ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
*ఇందులో సీనియర్‌ నటీమణులు శారద, కాంచన, రాజశ్రీ, బీఆర్‌ వరలక్ష్మి, కుట్టిపద్మిని, నళిని, ప్రియమణిలూ ఉన్నారు.
*ఎస్‌.జానకికి ‘ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జాతీయ అవార్డు’ను, ‘బాల సరస్వతి జాతీయ అవార్డు’ను వైజయంతి మాలాబాలీకి ప్రకటించింది. వీరితోపాటు నటులు కార్తీ, విజయ్‌సేతుపతి, శశికుమార్‌, ఎంఎస్‌ భాస్కర్‌, సంతానం, సూరి, ప్రభుదేవా, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా, విజయ్‌ ఆంటోని, నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు సురేష్‌కృష్ణ, సితార్‌ విద్వాంసులు జనార్దన్‌ మిట్టలనూ కలైమామణి పురస్కారాలు వరించాయి.
*వీరికి త్వరలోనే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అవార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams