Current Affairs Telugu Daily

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు 

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వేజోన్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 
*జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్లపై రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో రిజర్వేషన్‌ సవరణ *ఆర్డినెన్స్‌తో పాటు ఎల్‌వోసీ వద్ద నివసించే వారికి రిజర్వేషన్ల ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 
*ఈ సవరణ జమ్ముకశ్మీర్‌కు వర్తిస్తుందని జైట్లీ వివరించారు. దీంతో 10 శాతం ఈబీసీ కోటా ఆ రాష్ట్రానికి వర్తించనుందని చెప్పారు.

* హరియాణాలోని మనేధీలో ఎయిమ్స్‌ ఏర్పాటు

* గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, హిరసార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల ఏర్పాటు

* బ్రహ్మపుత్ర నదిపై నాలుగు వరుసల వంతెన నిర్మాణం

* ఆగ్రా మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు ఆమోదం.. రూ.8వేల కోట్లతో నిర్మాణం

* రెండు కారిడార్లతో కాన్పూర్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆమోదం


views: 799

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams