Current Affairs Telugu Daily

పశ్చిమ బెంగాల్‌లో మత ఘర్షణలు ..ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత
పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో 2017 జులై 4, 5 తేదీల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలివేశారు. బదూరియా ప్రాంతంతో పాటు బంగ్లాదేశ్‌ సరిహద్దులో మత ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక మతానికి చెందిన పుణ్యక్షేత్రాన్ని అగౌరపరుస్తూ అభ్యంతరకరంగా ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌తో గొడవలు మొదయ్యాయి.  బదూరియా చెలరేగిన ఘర్షణల విషయంలో గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి తనను బెదరించారని, అవమానపరిచారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
views: 932

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams