Current Affairs Telugu Daily

 విశాఖపట్నంలో నౌకాదళానికి చెందిన మరో యుద్ధ విమానం 

విశాఖపట్నంలో నౌకాదళానికి చెందిన మరో యుద్ధ విమానం కొలువుదీరనుంది. ఇందుకు విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్‌ బసంత్‌కుమార్‌తో పాటు ఇతర అధికారుల బృందం గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్సాను సందర్శించారు.ఈ నౌకాదళ కేంద్రంలో ఉంచిన సీహారియర్‌ యుద్ధ విమానాన్ని పరిశీలించారు. 
విశాఖలో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కురుసురా, టీయూ-142 యుద్ధ విమానం ఉండగా అదనంగా సీహారియర్‌ చేరనుంది. వీటన్నింటినీ కలిపి సమీకృత బీచ్‌ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. గతంలోనే భారత నౌకాదళం యుద్ధ విమానం సీహారియర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • ఇదీ సీహారియర్‌ ప్రాముఖ్యత 

*ఈ యుద్ధ విమానాన్ని బ్రిటన్‌కు చెందిన హాకర్‌ సిడెల్లీ బ్రిటీష్‌ ఏరోస్పేష్‌ సంస్థ రూపొందించింది.బీ 1980లో భారత నౌకాదళ అమ్ములపొదిలోకి వచ్చింది. 2012 వరకు సేవలు అందించింది. బీ ఐఎన్‌ఎస్‌ విరాట్‌, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధ నౌకల మీద నుంచి విన్యాసాలు చేయడం దీని ప్రత్యేకత.
*సీహారియర్‌ను ఎగురుతున్నట్లు కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆర్‌కేబీచ్‌లోనిరాజీవ్‌ స్మృతి భవనం వద్ద దీన్ని పైనుంచి వేలాడేలా  అమర్చుతారు. దీంతోపాటు యుద్ధ నమూనా విభాగాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. 
*సీహారియర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుండటం ఆనందంగా ఉందని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బసంత్‌కుమార్‌ అన్నారు. ఇక్కడ దాన్ని ఉంచడానికి ఎంత స్థలం అవసరం, గోవా నుంచి విశాఖకు ఎలా తరలించాలి వంటి అంశాలను పరిశీలించామన్నారు. 15 రోజుల్లో దీన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


views: 1208

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams