Current Affairs Telugu Daily

సీఐటీఐఐఎస్‌ చాలెంజ్‌కు అమరావతి ఎంపిక
స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రారంభించిన సీఐటీఐఐఎస్‌ చాలెంజ్‌ ఆర్థిక సహకార పథకానికి అమరావతి ఎంపికైనట్లు ఏపీసీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. ‘సిటీ ఇన్వె్‌స్టమెంట్స్‌ టు ఇన్నోవేట్‌, ఇంటిగ్రేట్‌ అండ్‌ సస్టెయిన్‌’ (సీఐటీఐఐఎస్‌) చాలెంజ్‌ పథకాన్ని ఫ్రెంచ్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ, యూరోపియన్‌ యూనియన్ల భాగస్వామ్యంతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందన్నారు.
దీనికోసం దేశంలోని 100 స్మార్ట్‌ నగరాలు పోటీపడగా 15 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని తెలిపారు. అమరావతి ప్రాజెక్ట్‌కు సంబంధించి తాము రూ.146 కోట్ల విలువైన ప్రతిపాదనలు సమర్పించగా.. ఈ చాలెంజ్‌ కింద అమరావతికి అత్యధికంగా రూ.80 కోట్ల ఆర్థిక సహకారంతోపాటు ప్రపంచస్థాయి సాంకేతిక నైపుణ్యం సైతం అందజేస్తారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ధుృవపత్రాన్ని కేంద్ర మంత్రి హర్దీ్‌పసింగ్‌పురి నుంచి సీఆర్డీయే అదనపు కమిషనర్‌, అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ సీఈవో సగిలి షణ్మోహన్‌ అందుకున్నారు.

views: 995

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams