Current Affairs Telugu Daily

తెలంగాణ లోని సిద్ధిపేట మరియు సిరిసిల్లకు జాతీయ పురస్కారాలు 
 స్కోచ్ సంస్థ అందించే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సిరిసిల్ల బల్దియా కైవసం చేసుకుంది. ఢిల్లీలో నిర్వహించిన 56స్కోచ్ సమ్మిట్‌లో ఆ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా బల్దియా ఇంజినీర్ రఘు, టీపీబీవో నవీన్ అవార్డును స్వీకరించారు.
దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలు చేసిన పురపాలక, నగరపాలక సంఘాలకు స్కోచ్ ఈ అవార్డులను ప్రదానం చేసింది. అందులోభాగంగా అభివృద్ధి పనుల విభాగంలో సిరిసిల్ల బల్దియా అవార్డును సొంతం చేసుకుంది. 
 *సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో రెండు స్కోచ్ అవార్డులను సాధించింది. జాతీయ స్థాయిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో స్కోచ్ గోల్డ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, స్వచ్ఛభారత్ గోల్డ్ అవార్డులను సిద్దిపేట మున్సిపాలిటీకి లభించాయి. ఢిల్లీలోని స్కోచ్ సంస్థ ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అవార్డులను సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అందుకున్నారు. దేశంలోని ఆయా రాష్ర్టాల్లో గల మున్సిపాలిటీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 50 మున్సిపాలిటీలతో పోటీ పడి సిద్దిపేట మున్సిపాలిటీ రెండు అవార్డులను గెలుచుకుంది.

views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams