Current Affairs Telugu Daily

తేజస్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళగా సింధు
ఇటీవలే మన వాయుసేనలో చేరిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు కోపైలెట్‌గా తెలుగు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు వ్యవహరించారు. విమానయానం, రక్షణ రంగాల్లో ఉన్న మహిళల కోసం 23 ఫిబ్రవరి 2019 నాటి  ప్రదర్శనను ప్రత్యేకించారు. దీనిలో భాగంగా సింధును డీఆర్‌డీవో ఆహ్వానించింది.
తేజస్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళగా సింధు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. అతి తక్కువ వయసు (23ఏళ్లు)లో యుద్ధ విమానాన్ని నడిపిన వ్యక్తిగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. ఇది తనకు గొప్ప అనుభూతిని మిగిల్చిందని ఆమె పేర్కొన్నారు.

views: 946

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams