Current Affairs Telugu Daily

ఫిబ్రవరి 25న బయో ఏషియా సదస్సు 2019 ప్రారంభం

ప్రపంచం నలుమూలల నుంచి జీవశాస్త్రాల రంగంలో పనిచేస్తున్న సంస్థలను ఒకే వేదికపైకి చేర్చేందుకు నిర్వహిస్తోన్న బయో ఏషియా సదస్సు 2019 హైదరాబాద్‌లో ఫిబ్రవరి 25న ప్రారంభం కానుంది.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ 16వ విడద బయో ఏషియా సదస్సులో దాదాపు 50 దేశాల నుంచి 800ల మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సుకు ఫెడరేషన్‌ ఆసియన్‌ బయోటెక్‌ ఆసోసియేషన్స్‌ (ఫాబా)తో పాటు నోవార్టీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌లు సహకారాన్ని అందిస్తున్నాయి.
మన దేశంతోపాటు దక్షిణ కొరియా సదస్సులో భాగస్వామ్యం అవుతుండగా, దక్షిణ ఆఫ్రికా, స్పెయిన్‌ దేశాలు అంతర్జాతీయ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఫిబ్రవరి 25న సాయంత్రం ఈ సదస్సును ప్రారంభించనున్నారు.

  • THEME - Disrupt The Disruption

views: 1130

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams