Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) విడుదల చేసిన ప్రకటనలో వాడిన భాష మనదేశం ప్రతిపాదించినదే
ఐక్యరాజ్యసమితి వేదికగా మనదేశం పాకిస్థాన్‌, చైనాలపై తిరుగులేని దౌత్య విజయం సాధించింది. పుల్వామా దారుణాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) ఏకగ్రీవంగా 21 ఫిబ్రవరి 2019న  విడుదల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమ్.
పుల్వామాలో ఉగ్రదాడిని తీవ్రపదజాలంతో ఖండిస్తూ ‘యూఎన్‌ఎస్‌సీ’ విడుదల చేసిన ప్రకటనలో వాడిన భాష మనదేశం ప్రతిపాదించినదేనని తెలిపాయి. ‘జైష్‌ ఎ మహ్మద్‌’ ఉగ్రవాద సంస్థ పేరు, ‘నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి’ అనేవి కూడా మిత్రదేశాల మద్దతుతో మనదేశమే తీర్మానంలో ప్రవేశపెట్టిందని పేర్కొన్నాయి. వాస్తవానికి పుల్వామా ఉగ్రదాడి జరిగిన ఫిబ్రవరి 14 మరుసటిరోజు అంటే 15న దారుణాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయాలని ‘యూఎన్‌ఎస్‌సీ’ ప్రయత్నించింది.
ఈ ప్రయత్నాన్ని నీరు గార్చడానికి చైనా చేయని ప్రయత్నం అంటూ లేదు. ఖండన ప్రకటనలో ఉగ్రవాదం అనే పదం వాడకూడదని, ఫలానా పేరు తీసేయాలని రకరకాల సవరణలు సూచించింది. దాదాపు వారంరోజులపాటు వాయిదా వేయించింది. చివరకు అమెరికా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మిగతా సభ్యదేశాలను ఒప్పించడంతో చైనా ఆటలు సాగలేదు. ఫలితంగా చరిత్రలోనే తొలిసారిగా జమ్మూకశ్మీరులో భారతీయ భద్రతా దళాలపై జరిగిన దాడిని ఉగ్రవాద ఘటనగా పేర్కొంటూ ఖండన ప్రకటన వెలువడింది.

views: 923



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams