Current Affairs Telugu Daily

సాయుధ బలగాలకు ఉచిత విమాన సౌకర్యం
పుల్వామా ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో దిల్లీ-శ్రీనగర్‌, జమ్మూ-శ్రీనగర్‌ల మధ్య రాకపోకలు సాగించే కేంద్ర సాయుధ పారామిలిటరీ దళ సిబ్బందికి విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
శ్రీనగర్‌ ప్రాంతం నుంచి జమ్మూ, దిల్లీకి రోడ్డుమార్గంలో ప్రయాణించడం అంత సురక్షితం కాదన్న ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఇకపై దిల్లీ-శ్రీనగర్‌, శ్రీనగర్‌-దిల్లీ, జమ్మూ-శ్రీనగర్‌, శ్రీనగర్‌-జమ్మూల మధ్య పారామిలిటరీ సిబ్బంది విమానాల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలవుతుంది.
దీనివల్ల కేంద్ర సాయుధ పారామిలిటరీ దళాల్లోని కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ స్థాయిల్లో పనిచేస్తున్న 7.80 లక్షల మందికి ఈ సౌకర్యం చేకూరుతుంది.

views: 754

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams