Current Affairs Telugu Daily

స్టాంపుల చట్టంలో మార్పులకు రాష్ట్రపతి ఆమోదం
భారత స్టాంపుల చట్టం, 1899లో మార్పులకు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. పన్నుల ఎగవేత నిరోధానికి, స్టాంపు సుంకం విధానం హేతుబద్ధీకరణకు ఈ చర్య దోహదపడనుంది.
*భారత స్టాంపుల చట్టం, 1899లో సవరణలను  ఆర్థిక చట్టం 2019లో భాగంగా చేర్చారు. దీనికి పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. సెక్యూరిటీల మార్కెట్‌ పెట్టుబడులపై స్టాంపు సుంకాన్ని రాష్ట్రాలు ఒకే చోట, ఒకే సంస్థ (స్టాక్‌ ఎక్స్ఛేంజీలు లేదా స్టాక్‌ ఎక్చ్ఛేంజీలు, డిపాజిటరీల అనుమతి ఉన్న క్లియరింగ్‌ కార్పొరేషన్‌లు) ద్వారా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సవరణల రూపంలో ప్రతిపాదించారని ఆర్థిక శాఖ తెలిపింది.
*రాష్ట్ర ప్రభుత్వాలతో స్టాంపు సుంకం పంచుకోవడానికి కూడా ప్రత్యేక విధానాన్ని ఇందులో ప్రతిపాదించారు.

views: 794

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams