Current Affairs Telugu Daily

2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో తెలంగాణ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్నెళ్ల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
తొలుత పుల్వామా ఘటనను ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అమరవీరులకు సంతాపం తెలిపారు. అమరులైన ఒక్కో కుటుంబానికి రూ.25లక్షలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.
2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

  • తెలంగాణ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

* తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ 
* తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. 
* అన్ని రంగాలకు 24గంటల పాటు విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నాం.
* వ్యవసాయ రంగంలో అడ్డంకులను ఒక్కొక్కటి తొలగించుకుంటూ ముందుకు సాగుతూ రైతుల్లో నైరాశ్యాన్ని తొలగిస్తున్నాం. 
* అన్ని రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్‌ గురించి చర్చ జరుగుతోంది.
* తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం.
* ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది. 
* ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగింది. 

* మరోసారి ప్రజలు తెరాసకు అధికారం ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటారు.
* 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10.6శాతంగా నమోదైంది. 
* పేదల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,116కు పెంచుతున్నాం.
* దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచుతున్నాం. 
* వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తాం.
* ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,067కోట్లు కేటాయిస్తున్నాం.

* 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
* రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
*వ్యయం రూ.32,815కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు
* ఆర్థిక లోటు అంచనా రూ.27,749కోట్లు
* 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10.4శాతం 
* 2017-18లో మొత్తం వ్యయం రూ.1,43,133కోట్లు
* 2017-18లో రెవెన్యూ మిగులు రూ.3,459కోట్లు 
* 2018-19 సవరించిన అంచనా వ్యయం రూ.1,61,857కోట్లు
* 2018-19లో సవరించిన అంచనా ప్రకారం రెవెన్యూ మిగులు రూ.353కోట్లు 
* 2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ.94,776కోట్లు
* 2019-20లో కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా రూ.22,835కోట్లు 
* 2019-20లో ప్రగతి పద్దు రూ.1,07,302కోట్లు
* నిర్వహణ పద్దు రూ.74,715కోట్లు 
* 2019-20 అంచనాలో రెవెన్యూ మిగులు రూ.6564కోట్లు
* ఆర్థికలోటు అంచనా రూ.27,749కోట్లు 
* రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
* మూలధన వ్యయం రూ.32,815కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు 
* కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు.
* నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు
* ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు
* ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు
* రైతు రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు

* బియ్యం రాయితీకి రూ.2,774కోట్లు
* రైతు బీమా కోసం రూ.650కోట్లు
* రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు. ఇందు కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు 
* ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
* వ్యవసాయశాఖకు రూ.20,107కోట్ల కేటాయింపు.

* 2019-20 బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు కేటాయింపు

* ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536కోట్లు 
* పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు 
* ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు 
* 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు 
* టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు 
* టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు 
* 8.58లక్షల ఉద్యోగాలు వచ్చాయి.

* వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536కోట్లు
* బీసీల కోసం 119 గురుకులాల ఏర్పాటు.
* విద్యుత్‌ సంక్షోభాన్ని తెలంగాణ చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది
* మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. 
* దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో మనరాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
* తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
* విద్యుత్‌ వినియోగం వృద్ధిరేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం గర్వకారణం
* ఏప్రిల్‌ చివరి నాటికి మిషన్‌ భగీరథ పనుల్ని వందశాతం పూర్తి చేస్తాం. 
*  మరో రెండు నెలల్లో ఇంటింటింకి నల్లాద్వారా మంచినీళ్లు అందిస్తాం
* నిరుపేదలకు గృహ నిర్మాణపథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 
* రెండు పడల గదుల ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు 2,72,763
* ఇళ్లు కట్టుకునేవారికి ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం 
* 340 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తాం
* ప్రస్తుతమున్న రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయం


views: 1032Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams