Current Affairs Telugu Daily

భారత్‌లోని థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాలతోనే అధిక హాని
బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిలో అమెరికా, చైనాలు ముందున్నా భారత్‌లోని థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాలే ఎక్కువ హాని కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జురిక్‌ వర్సిటీ పరిశోధకులు దీన్ని నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7,861 బొగ్గు ఆధారిత విద్యుత్‌ కర్మాగారాల వివరాలను పరిశీలించి, వాటి దుష్ప్రభావాలను అంచనా వేశారు. ఈ కర్మాగారాలు కార్బన్‌ డై ఆక్సైడ్‌తో పాటు భూతాపాన్ని పెంచే అనేక కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి.
ఆరోగ్య సమస్యలను కలిగించే రేణువులు, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, మెర్యూరీలను వెలువరుస్తాయి. పొగను శుద్ధి చేసే సామర్థ్యం లేని పాత తరం కర్మాగారాలు భారత్‌, తూర్పు ఐరోపా, రష్యాల్లో పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

views: 766

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams