Current Affairs Telugu Daily

నేటి నుంచి పరిశోధనపై అంతర్జాతీయ సదస్సు
భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య(ఫిక్కి), కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సంయుక్త భాగస్వామ్యంలో ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధి సదస్సు-2019 ఫిబ్రవరి 21 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో ఒక భాగస్వామిగా ఆఫ్రికా ఖండానికి చెందిన జాంబియా, ఇథియోపియా, రువాండా తదితర దేశాల విద్యాశాఖ, సాంకేతిక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం ఫిక్కి ప్రతినిధులతో కలిసి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధిలో భారత్‌, ఆఫ్రికా దేశాల మధ్య పరస్పర సహకారానికి చర్చలు జరుగుతాయన్నారు. వ్యవసాయం, ఆహార శుద్ధి, వైద్యం, పరిశోధనపై సహకారంపై చర్చిస్తారని తెలిపారు.

views: 931

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams