ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ విమానాల విడిభాగాల తయారీ సంస్థ ‘సఫ్రాన్’ హైదరాబాద్‌లో రూ.290 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ప్రత్యేక ఆర్థిక మండలి సమీపంలో స్థాపించనున్న ఈ పరిశ్రమలో విమాన లీఫ్ టర్బోఫ్యాన్ ఇంజిన్ల విడిభాగాలు తయారుచేస్తారు.
ఈ పరిశ్రమ ద్వారా 50 మంది నిపుణులు, మరో 300 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. సంస్థ సీఈవో ఫిలిప్ పెటిట్కొలిన్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు.
తెలంగాణలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ద్వారా వైమానిక పరిశ్రమ ఏర్పాటు కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తంచేశారు. ఈ భేటీలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
views: 958