Current Affairs Telugu Daily

రాష్ర్టాలకు కేంద్రం బదలాయించే పన్నుల వాటాను 42% నుంచి 50 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి KCR 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే వాస్తవాన్ని గుర్తిస్తూ సమానత్వం-సామర్థ్యం మధ్య సమతుల్యాన్ని పాటించేలా సిఫార్సులు ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఆర్థిక వనరుల పంపిణీలో కేంద్రం  రాష్ట్రాల మధ్య ఆర్థిక సమాఖ్య స్ఫూర్తి కనబరిచేలా చూడాలన్నారు.
*కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. సంక్షేమ పథకాలను అమలు చేసుకునే బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలకు వదిలిపెట్టాలన్నారు. గతంలో గుజరాత్‌, కేరళ ఆదర్శ విధానాలపై చర్చించుకునేవారని ఇప్పుడు అభివృద్ధిలో తెలంగాణ విధానం మార్గదర్శకంగా అనుసరణీయంగా ఉందన్నారు. ఆర్థిక నిబద్ధతలో కేంద్రం కంటే రాష్ట్రాలు మిన్నగా ఉన్నాయన్నారు.
*బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజాకర్షక పథకాల పేరుతో ప్రోత్సాహకర నిధులను ఇవ్వకుండా నిరాకరించడం సరికాదన్నారు. మంగళవారం హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి సమావేశమై మాట్లాడారు. సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌, సభ్యులు అనూప్‌సింగ్‌, అశోక్‌ లహరి, కార్యదర్శి రమేష్‌చంద్‌, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు.

views: 856



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams