Current Affairs Telugu Daily

సీబీఐ తాత్కాలిక డైరెక్టరుగా నాగేశ్వరరావు నియామకం చట్టవిరుద్ధం కాదు
సీబీఐ తాత్కాలిక డైరెక్టరుగా ఎం.నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు  Feb 19న కొట్టివేసింది. ఏ రకంగా చూసినా ఆయన నియామకమేమీ చట్టవిరుద్ధం, అనధికారికం కానేకాదని స్పష్టం చేసింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టరు పదవికి తగిన అధికారిని నియమించే అధికారాన్ని ‘దిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌’ (డీఎస్‌పీఈ) చట్టంలోని సెక్షన్‌ 4 ఏ కింద అత్యున్నతస్థాయి ఎంపిక సంఘం కేంద్రప్రభుత్వానికిచ్చిందని పేర్కొంది.
*అక్టోబరు 2017:    అస్థానాకు పదోన్నతిని వ్యతిరేకిస్తూ అలోక్‌ వర్మ సీవీసీకి తన గళాన్ని వినిపించారు. కానీ, సీవీసీతో పాటు సుప్రీంకోర్టు కూడా అస్థానాకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.
*2 జూలై 2018:    అస్థానా సీబీఐలో నంబర్‌ 2 అయినప్పటికీ తాను లేని సమయంలో తన తరఫున సీబీఐ సమావేశాల్లో పాల్గొనరాదంటూ అలోక్‌ వర్మ సీవీసీకి లేఖ రాశారు.
*ఆగస్టు 24: తనపై లేఖకు ప్రతిగా అస్థానా అలోక్‌ వర్మపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీవీసీ, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి లేఖ రాశారు. మొయిన్‌ ఖురేషి కేసులో నిందితుడి నుంచి అలోక్‌ వర్మ రూ.2 కోట్లు లంచంగా తీసుకున్నారని ఆరోపించారు.
*అక్టోబరు 4: ఖురేషి కేసులో నిందితుడైన సానా సతీశ్‌ తాను అస్థానాకు రూ.3 కోట్లు లంచమిచ్చినట్లు చెప్పారు.
*అక్టోబరు 15: అస్థానాపై ముడుపుల కేసు నమోదు
అక్టోబరు 16: దళారీ మనోజ్‌ ప్రసాద్‌ అరెస్టు
*అక్టోబరు 22: తప్పుడు రికార్డులపై డీఎస్పీ దేవేందర్‌ అరెస్టు
*అక్టోబరు 23: ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు అస్థానా. దర్యాప్తు ముసుగులో తమ ప్రధాన కార్యాలయం కేంద్రంగా బలవంతపు వసూళ్ల పర్వం సాగిందని కోర్టుకు తెలిపిన సీబీఐ
*అక్టోబరు 24: అలోక్‌, అస్థానాలను పక్కనబెట్టిన కేంద్రం. సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వరరావు

views: 738

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams