Current Affairs Telugu Daily

అత్యవసర పరిస్థితులకు ఒకే ఒక్క హెల్ప్‌లైన్‌ నెంబర్ 112
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అనేక హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసే బదులు, ఇకపై ఒకే ఒక్క నంబర్‌కు ఫోన్‌ చేస్తే సరిపోతుంది. పోలీసులు(100), అగ్నిమాపక శాఖ(101), ఆరోగ్యం(108), మహిళల హెల్ప్‌లైన్‌(1090) తదితర నంబర్లకు బదులు ఇకపై కేవలం 112 నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు.
*ఈ సమీకృత మద్దతు వ్యవస్థ మంగళవారం (ఫిబ్రవరి 19) నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థలో (ఈఆర్‌ఎస్‌ఎస్‌) భాగంగా అత్యవసర స్పందన కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
  • ‘షౌట్‌’ ఫీచర్‌ మహిళలకు ప్రత్యేకం
112 నంబరు సౌకర్యంతోపాటు గూగుల్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ‘112 ఇండియా’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఉపయోగించుకునేవారికి అదనపు సౌలభ్యాలు సమకూర్చారు.
*సందేశాలతో పాటు వారున్న ప్రాంతాన్ని షేర్‌ చేయొచ్చు. యాప్‌లో మహిళల కోసమే ఒక ప్రత్యేకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఉండే ‘షౌట్‌’ బటన్‌ను నొక్కితే సంబంధిత మహిళ ఎక్కడైతే ఉన్నారో, అక్కడి సమీప ప్రాంతంలో ఉన్న ‘స్వచ్ఛంద సేవకులు’ అందరికీ ఆమె ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిపోతుంది. ప్రభుత్వ సంస్థల నుంచి సాయం అందడానికి ముందే సాయం అందే అవకాశం ఉంది.

views: 1013

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams