Current Affairs Telugu Daily

అంకురాల ప్రోత్సాహానికి ల్యాబ్‌32
దేశ వ్యాప్తంగా ఉన్న అంకుర సంస్థలను ప్రోత్సహించడం, వాటి సమస్యలను పరిష్కరించి, వృద్ధికి అవకాశాన్ని కల్పించడంలాంటి లక్ష్యాలతో ప్రారంభించిన ల్యాబ్‌32 ఇంక్యుబేషన్‌ కార్యక్రమానికి అంకుర సంస్థల నుంచి టి-హబ్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
‘స్టార్టప్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా గత ఏడాది ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 70 అంకురాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించింది. రెండో విడత ల్యాబ్‌ 32 కార్యక్రమాన్ని మే 1 నుంచి ప్రారంభిస్తున్నామని టి-హబ్‌ సీఈఓ రవి నారాయణ్‌ తెలిపారు. దీనికోసం అంకురాల నుంచి దరఖాస్తులను ఏప్రిల్‌ 8 వరకూ స్వీకరించనున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా ఆరోగ్యం, ఆర్థిక, రవాణా, సామాజికంగా ప్రభావం చూపేవి, స్మార్ట్‌ నగరాలు, విద్యా సంబంధిత అంశాలపై పనిచేస్తున్న అంకురాలు దీనికి అర్హులు. ఎంపికైన సంస్థలకు మార్కెటింగ్‌, నిధుల సమీకరణలో సహాయం, ఆయా రంగాల్లో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పరిచయం, టి-హబ్‌లోని సౌకర్యాలను పూర్తిగా లేదా 6 నెలలపాటు వినియోగించుకునే వీలుంటుంది.
గత ఏడాది ఈ కార్యక్రమానికి ఎంపికైన అంకురాలకు దాదాపు రూ.112 కోట్ల వరకూ నిధులు సమకూరాయి. ఆయా సంస్థల ద్వారా 2,000లకు పైగా ఉద్యోగాలు వచ్చాయి.
  • T-Hub Founded: 5 November 2015
  • Purpose: Business incubator
  • CEO: Ravi Narayan 

views: 837

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams