Current Affairs Telugu Daily

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు యమీన్‌ అరెస్టు
నగదు అక్రమ చలామణికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను అధికారులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబరులో అధ్యక్ష ఎన్నికలకు ముందు 1.5 మిలియన్ల అమెరికా డాలర్లను చట్టవ్యతిరేకంగా సేకరించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.
మిలియన్ల డాలర్ల నిధులను ఆయన మాల్దీవులు దాటించి విదేశాల్లో దాచినట్లు నమ్ముతున్న ప్రభుత్వం, ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే ఆయనకు చెందిన 6.5మిలియన్ల డాలర్ల విలువైన స్థానిక బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది.
  • Maldives Capital: Malé
  • Currency: Maldivian rufiyaa
  • President: Ibrahim Mohamed Solih

views: 717

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams