ఎస్సీవర్గాల గురించి ప్రస్తావించేటప్పుడు ‘దళితులు’ అని రాయవద్దని ప్రసార మాధ్యమాలకు సలహా ఇస్తూ కేంద్రం ఇచ్చిన అధికారిక ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్గొగొయి, జస్టిస్ సంజీవ్ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈమేరకు నిర్ణయించింది. ‘‘నా గుర్తింపు(ఐడెంటిటీ)ను ప్రశ్నిస్తూ కేంద్రప్రభుత్వం సదరు ప్రకటనను ఎలా జారీ చేయగలదు?’’ అని వ్యాజ్యాన్ని దాఖలు చేసిన వి.ఎ.రమేశ్నాథన్ అనే వ్యక్తి ప్రశ్నించారు.
దళితులు అనే పదం వాడరాదని, షెడ్యూల్డ్ కులాలు అని ఉపయోగించాలని గత ఏడాది ప్రైవేటు శాటిలైట్ టీవీ ఛానళ్లకు సూచిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ సలహా ఇచ్చింది. అన్ని అధికారిక కార్యకలాపాలు, ధ్రువీకరణపత్రాలకూ ఇదే వర్తిస్తుందని అదే ఏడాది ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
views: 798