Current Affairs Telugu Daily

కౌలు రైతుకు ఏడాదికి కుటుంబానికి రూ.15,000 ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది.
*కేంద్రం ప్రకటించిన పీఎం-కిసాన్‌లో కౌలు రైతుల ప్రస్తావనే లేదు. అయినా రాష్ట్రం సొంతంగా సాయం చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1,350 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పంట రుణాలతోపాటు రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా విషయంలోనూ ప్రభుత్వం వీరికి ప్రాధాన్యమిస్తోంది. మరే రాష్ట్రంలో లేని విధంగా రూ.5వేల కోట్ల పంటరుణాలు ఇప్పించింది.
*రెవెన్యూశాఖ ద్వారా రుణ అర్హత కార్డులు, వ్యవసాయశాఖద్వారా కౌలుదారు పత్రాలు మంజూరు చేయించింది. ఇప్పుడు పెట్టుబడి సాయం అందించనుంది. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే సొంతంగా అయిదెకరాల లోపున్న రైతులకు రూ.9వేలు, అయిదెకరాల పైబడిన వారికి రూ.10వేలు ఇస్తుండగా.. సెంటు భూమి లేని కౌలు రైతులకు ఏకంగా రూ.15,000 చొప్పున ఇవ్వనుంది.రాష్ట్రంలో అధికారిక అంచనాల ప్రకారం గుర్తించిన 15.50 లక్షల మంది కౌలు రైతుల్లో సెంటు భూమి లేని వారు సుమారు 9 లక్షల వరకు ఉంటారని అంచనా.
  • పెట్టుబడి సాయంపై ఉత్తర్వులు విడుదల
*అయిదెకరాల లోపు ఉన్న రైతు కుటుంబాలకు రూ.9వేల చొప్పున రాష్ట్రం ఇస్తుంది. కేంద్రం పీఎం-కిసాన్‌ కింద ఇచ్చే రూ.6వేలతో కలిపితే ఒక్కో కుటుంబానికి రూ.15వేలు అందుతుంది. పీఎం-కిసాన్‌ వర్తించని, అయిదెకరాల పైన ఉన్న రైతు కుటుంబాలకు రూ.10వేల చొప్పున రాష్ట్రమే ఇస్తుంది.
*అయిదెకరాల లోపు, అయిదెకరాలు పైబడిన రైతులకు తక్షణ సాయంగా రూ.4వేల మొత్తాన్ని మార్చి లోపు ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్టీజీ ఆధ్వర్యంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.1,000 చొప్పున 44 లక్షల ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారు. వీరందరి ఖాతాలకు నేరుగా నగదు జమ అయిందని నిర్ధరణ అయ్యాక మార్చిలో మిగిలిన రూ.3వేలు బదిలీ చేస్తారు.

views: 1096

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams