Current Affairs Telugu Daily

టెఫెరా ప్రపంచ రికార్డు
ఇథియోపియన్ యువ సంచలనం సామ్యూల్ టెఫెరా 1500 మీటర్ల ఇండోర్ పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. Feb 17 న జరిగిన బర్మింగ్‌హామ్ ఇండోర్ గ్రాండ్ ప్రి ఈవెంట్‌లో సామ్యూల్ 1500 మీటర్ల పరుగును 3ని. 31.04 సెకండ్లలో ముగించాడు.
దీంతో 1997లో మొరాకో దిగ్గజం హిచమ్ ఎల్ గురెజ్ నెలకొల్పిన 3ని. 31.18 సెకండ్ల రికార్డును బద్దలుకొట్టాడు. సామ్యూల్ 0.14 సెకండ్ల ముందుగానే లక్ష్యాన్ని చేరడం విశేషం. ఇక హోరాహోరీగా సాగిన గ్రాండ్‌ప్రి పరుగులో సామ్యూ ల్ తన సహచరుడు యోమి ఫ్ కెల్చా కంటే 0.54 సెకండ్లలో రేసును ముగించి టాప్‌లో నిలిచాడు
  • వేదిక:బర్మింగ్‌హామ్
  • ఏమిటి:1500 మీటర్ల ఇండోర్ పరుగులో ప్రపంచ రికార్డు
  • గత రికార్డు:1997లో మొరాకో దిగ్గజం హిచమ్ ఎల్ గురెజ్ నెలకొల్పిన 3ని. 31.18 సెకండ్ల రికార్డు

views: 866

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams