Current Affairs Telugu Daily

శ్రమ యోగి మాన్-ధన్ (పీఎంఎస్‌వైఎం) పథకానికి ఇ సేవ కేంద్రాలు
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (పీఎంఎస్‌వైఎం) పథకానికి దేశవ్యాప్తంగా 3.13 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల (మీ-సేవా కేంద్రాల)లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. రూ.3 వేల నెలవారీ పింఛన్‌ను అందించే ఈ పథకంలో అసంఘటిత రంగ కార్మికులు చందాదారులుగా చేరవచ్చు.
ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ పీఎంఎస్‌వైఎం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. 18 - 40 ఏండ్ల మధ్య వయస్కు లైన అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఇందులో చేరిన వారు 60 ఏండ్ల వయసు దాటిన తర్వాత నెలకు కనీసం రూ.3 వేల పింఛన్ పొందేందుకు అర్హులవుతారని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు

views: 1089

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams