Current Affairs Telugu Daily

డ్వాక్రా’స్మార్ట్‌‌ఫోన్ల కొనుగోలుకు రెండు కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక గ్రూపు మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఫోన్ల ఎంపికతో పాటు కొనుగోలు కోసం రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు.
స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఉచితంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-ప్రగతి, మీసేవ, యువనేస్తం, ఆర్టీజీ, 1100 తదితర సేవలను స్మార్ట్‌ ఫోన్ల ద్వారా పొందేందుకు వీలుగా ప్రతి మహిళకూ స్మార్ట్‌ ఫోన్‌ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ సేవలను సునాయాసంగా పొందేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండేలా స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేయాలని  అందుకు అనుగుణంగా సాంకేతిక ప్రమాణాలు ఉండేలా వాటిని ఎంపిక చేసేందుకు రియల్‌టైమ్‌ గవర్నెన్సు సీఈవో అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
సాంకేతిక కమిటీ సూచించిన ఫోన్లను బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసేందుకు వీలుగా మరో కమిటీని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

views: 1058

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams