Current Affairs Telugu Daily

బోగస్ ఈ-వే బిల్లుల కట్టడికి కమిటీ ఏర్పాటు
రాష్ట్రాల మధ్య సరకు రవాణాకు అవసరమైన ఈ-వే బిల్లుల్లో బోగస్‌ బిల్లులు ఎక్కువైన నేపథ్యంలో వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర రెవెన్యూశాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బోగస్ ఈ-వే బిల్లులను నియంత్రించేందుకు రెవెన్యూశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతుంది.
సరకు రవాణాకు సంబంధించి నకిలీ ఇన్‌వాయిస్‌లు, బోగస్ ఈ-వే బిల్లులు ఉన్నట్లు గుర్తించిన సీబీఐసీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్) ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. బోగస్‌ బిల్లుల ద్వారా పన్నుఎగవేతలకు పాల్పడుతున్న వారిని కట్టడిచేసి, ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన విధివిధానాల కోసం ఈ కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు

views: 707

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams