Current Affairs Telugu Daily

జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంప్‌ నెహ్వాల్‌
సైనా నెహ్వాల్‌ మళ్లీ మెరిసింది.మరో అద్భుత ప్రదర్శనతో జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా నిలిచింది.
Feb 16న జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండోసీడ్‌ సైనా 21-18, 21-15తో టాప్‌సీడ్‌ పి.వి.సింధును ఓడించింది. తొలి గేమ్‌లో సింధు నుంచి గట్టిపోటీ ఎదురైనా నెహ్వాల్‌ 21-18తో గేమ్‌ గెలిచింది. రెండో గేమ్‌లో ఇద్దరు షట్లర్లు నువ్వానేనా అన్నట్లు తలపడడంతో పోరు 7-7తో హోరాహోరీగా సాగింది. అయితే ఆ తర్వాత వరుస పాయింట్లతో 11-9తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా.ఆపై సింధును వెనక్కి నెట్టేసింది.
 *గతేడాది నాగ్‌పుర్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సింధునే ఓడించి టైటిల్‌  గెలిచిన సైనా.. మరోసారి అదే  ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ కైవసం చేసుకుంది. 
*పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 21-18, 21-13తో లక్ష్యసేన్‌ను ఓడించిన అతను మూడోసారి జాతీయ ఛాంపియన్‌ అయ్యాడు. 
*పురుషుల డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా-చిరాగ్‌శెట్టి టైటిల్‌ గెలిచారు. ఫైనల్లో ఈ జోడీ 21-13, 22-20తో అర్జున్‌-శ్లోక్‌ రామచంద్రన్‌పై గెలిచింది. మహిళల డబుల్స్‌లో శిఖ-అశ్విని 21-16, 22-20తో మేఘన-పూర్వీషాలపై గెలిచి టైటిల్‌ నెగ్గగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మను అత్రి-మనీషా 18-21, 21-17, 21-16తో రోహన్‌-కుహు గార్గ్‌ను ఓడించి విజేతలుగా నిలిచారు.

views: 887



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams