Current Affairs Telugu Daily

అయోధ్య భూసేకరణ చట్టం రాజ్యాంగబద్ధతపై విచారణకు సుప్రీం అంగీకారం
కేంద్ర ప్రభుత్వం 1993లో తీసుకొచ్చిన ‘అయోధ్య భూసేకరణ చట్టం’ రాజ్యాంగబద్ధంగా లేదని సవాలుచేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. నిజానికి ఈ చట్టం ద్వారానే అయోధ్యలో వివాదాస్పద రామ జన్మభూమి, బాబ్రీ మసీదు పరిసరాలు సహా మొత్తం 67.703 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది.
ఇలా సమీకరించిన భూమిలో హిందువులు పూజలు నిర్వహించి, దేవుని దర్శనాలు చేసుకునే స్థలాలున్నాయనీ; వాటిని చట్టం ద్వారా సమీకరించడం మతస్వేచ్ఛకు విరుద్ధమంటూ ఇద్దరు న్యాయవాదులు సహా మొత్తం ఏడుగురు వ్యక్తులు తాజాగా పిటిషన్‌ వేశారు.
ఆయా స్థలాల్లో పూజలు, దర్శనాలను అడ్డుకోవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం శుక్రవారం దీన్ని పరిశీలించింది. అయోధ్య ప్రధాన భూవివాదం కేసుతో పాటే దీనిపైనా విచారణ చేపడతామని పేర్కొంది

views: 814

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams