Current Affairs Telugu Daily

ఫిబ్రవరి 16 నుంచి డెక్కన్‌-ఇరాన్‌ చరిత్ర అంతర్జాతీయ సదస్సు
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ నెల 16,17 తేదీల్లో వర్సిటీ చరిత్ర శాఖ, డెక్కన్‌ హిస్టరీ సొసైటీలు సంయుక్తంగా అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నాయి. సదస్సులో 14వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్యకాలంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు, చారిత్రక మూలాల పరిశోధనలపై చర్చించనున్నారు.
దాదాపు 60 మంది జాతీయ, అంతర్జాతీయ పరిశోధకులు ఈ అంశంపై తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. దీంతో పాటు సదస్సులో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, ప్రముఖ జర్నలిస్ట్‌, ప్రొఫెసర్‌ ఎస్‌.బషీరుద్దీన్‌ స్మారక ఉపన్యాసంలో భాగంగా ‘డెక్కన్‌పై సుఫిజం ప్రభావం’ అనే అంశంపై న్యూఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అజీజుద్దిన్‌ హుస్సేన్‌ ప్రసంగిస్తారు.

views: 907

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams