Current Affairs Telugu Daily

జీపీఎస్‌ లేకుండానే నడిచివెళ్లే యాంట్‌బోట్‌
ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ (జీపీఎస్‌) లేకుండానే ఒక చోటు నుంచి మరో చోటుకు నడిచివేళ్లే రోబోను తొలిసారిగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎడారి చీమలను స్ఫూర్తిగా తీసుకుని ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (సీఎన్‌ఆర్‌ఎస్‌) పరిశోధకులు దీన్ని రూపొందించారు.
2.3 కిలోల బరువు, ఆరు కాళ్లు కలిగిన ఈ రోబోకు ‘యాంట్‌బోట్‌’ అని వారు నామకరణం చేశారు. వందల మీటర్ల దూరం ప్రయాణించినా ఎడారి చీమలు తమ పుట్టకు తిరిగి నేరుగా రాగలుగుతాయి. పరిసరాలతో సంబంధం లేకుండా సూర్యుడి ఆధారంగా కాంతి, అతినీలలోహిత రేడియేషన్‌ను గుర్తిస్తూ అవి తమ దారిని కనుక్కొంటాయి.
యాంట్‌బోట్‌ విషయంలోనూ ఇదే పద్ధతిని పరిశోధకులు అనుసరించారు. కాంతి, అతినీలలోహిత రేడియేషన్‌ను గుర్తించే ఓ కటక దిక్సూచిని రూపొందించి దానికి బిగించారు. 14 మీటర్ల దూరం వెళ్లినా తిరిగి ఒక సెంటీమీటర్‌ అటూఇటుగా బయల్దేరిన ప్రదేశానికి ఆ రోబో చేరుకోగలుగుతోంది.
  • ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌అధ్యక్షుడు: Antoine Petit

views: 879

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams