Current Affairs Telugu Daily

అమేఠిలో ‘ఏకే 203’ ఉత్పత్తి 
నిముషానికి 600 రౌండ్ల గుళ్లను కురిపించే ‘ఏకే 47’ మెషీన్‌గన్‌ను మించిన ‘ఏకే 203’ కలెష్నికోవ్‌లను భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠిలో వీటిని తయారు చేయనుండడం విశేషం.
ఇక్కడి కొర్వా ఆయుధ కర్మాగారంలో వీటిని ఉత్పత్తి చేయనున్నారు. 7.5లక్షల మెషీన్‌గన్లను తయారుచేయడానికి రష్యాతో మనదేశం అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 15న ఇరుదేశాలు ఒప్పందపత్రాలపై సంతకాలు చేయనున్నాయి. ఫిబ్రవరి 28న కొర్వాలో ప్రధాని మోదీ చేతులమీదుగా తుపాకుల ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
  • అమేఠి: UP 
  • UP Chief minister: Yogi Adityanath
  • Governor: Ram Naik

views: 795

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams