Current Affairs Telugu Daily

బహిరంగ ప్రదేశాల్ని మలినం చేస్తే శిక్ష
బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, ఉమ్మి వేయడం, చెత్త పారబోసే వారిని శిక్షించేలా కేంద్రం సమగ్ర నమూనా చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది.
దీనివల్ల స్వచ్ఛభారత్‌ మిషన్‌ కార్యక్రమానికి చట్టబద్ధమైన మద్దతును అందించవచ్చని, పారిశుద్ధ్యం రాష్ట్ర అంశమైనందున రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకోవాలని, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకొనేలా పురపాలక సంఘాలకు చట్టపరమైన సాధికారత కల్పించాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరినట్లు ‘అధీన చట్టాలపై పార్లమెంటరీ కమిటీ’ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఎంపీ దిలీప్‌ మన్సుఖ్‌లాల్‌ తెలిపారు.
పారిశుద్ధ్యమనేది ప్రవర్తనపరమైన మార్పునకు సంబంధించిన అంశమని, దీనిని స్థానిక స్థాయిలోనే పర్యవేక్షించాలన్నారు

views: 776

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams