Current Affairs Telugu Daily

తెలంగాణ యాసంగి వరిసాగు 6.11 లక్షల హెక్టార్లు
తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్ ఆరంభంనుంచి మందకొడిగా సాగుతున్న వరి సాగు విస్తీర్ణం ఎట్టకేలకు 87 శాతానికి చేరుకున్నది. ఈ సీజన్‌లో 7.05 లక్షల హెక్టార్ల విస్తీరణంలో వరిసాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు 6.11 (87 శాతం) లక్షల హెక్టార్లలో సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రం లో 7.30 లక్షల హెక్టార్లలో వరి సాగైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ యాసంగిలో 13.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కాగా ఇప్పటివరకు 10.55 (79 శాతం) లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పం టలు సాగయ్యాయి. మక్కజొన్న 1.12 లక్షల హెక్టార్లు, శనగ 1.10 లక్షల హెక్టార్లు, వేరుశనగ 1.08 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. నూనెగింజలు 1.18 లక్షల హెక్టార్లు, పప్పు ధాన్యాలు 1.28 లక్షల హెక్టార్లలో సాగయ్యా యి. పొగాకు, మిర్చి, ఉల్లిగడ్డ, పొద్దుతిరుగు డు, నువ్వులు, కందులు, మినుములు, పెసర్లు, జొన్న పంటలు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయి.
మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో 100 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆదిలాబాద్‌లో ఏకంగా 126 శాతం విస్తీర్ణంలో పంటల సాగు నమోదైంది. వరంగల్‌రూరల్, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మక్కజొన్నపై కత్తెరపురుగు ప్రభావం పడింది.

views: 825

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams