Current Affairs Telugu Daily

రఫేల్‌పై కాగ్ నివేదిక
ఈ నివేదికలో 126 విమానాల కొనుగోలు డీల్‌తో పోల్చుకుంటే కొత్త డీల్‌లో భారత్‌ అవసరాలకు తగినట్లు మార్పులు చేసిన 36 యుద్ధ విమానాల కొనుగోలులో 17.08 శాతం సొమ్ము ఆదా అయ్యిందని కాగ్‌ తన రిపోర్టులో పేర్కొంది. పాత డీల్‌తో పోలిస్తే కొత్త డీల్‌లో తొలి 18 యుద్ధ విమానాలు 5 నెలల ముందే భారత్‌కు చేరతాయని తెలిపింది. ఈ ఒప్పందం మొత్తం మీద 2.86శాతం తక్కువ ధరకే జరిగిందని పేర్కొంది. 
కీలక అంశాలు..
* 2015 మార్చిలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక బృందం 126 విమానాల కొనుగోలు డీల్‌ను రద్దు చేయాలని పేర్కొంది. ఈ డీల్‌లో దసో అత్యల్ప ధర కోట్‌ చేసిన బిడ్డర్‌ కాదని పేర్కొంది. అదే సమయంలో యూరోపియన్‌ ఏరోనాటిక్స్‌ డిఫెన్స్‌ స్పేస్‌ కంపెనీ కూడా టెండర్‌ అర్హతలను పూర్తిగా చేరుకోలేదని కాగ్‌ వెల్లడించింది.
* ఈ ఒప్పందం సందర్భంగా భారత వాయుసేన (ఏఎస్‌క్యూఆర్‌) ఎయిర్‌స్టాఫ్‌ క్వాలిటేటీవ్‌ రిక్వైర్‌మెంట్స్‌ను సరిగా వివరించలేదని కాగ్‌ పేర్కొంది. ఫలితంగా ఏ విక్రేతా ఈ ఏఎస్‌క్యూఆర్‌ను సంతృప్తి పరచలేకపోయిందని వెల్లడించింది.
* కొనుగోళ్ల సమయంలో ఏఎస్‌క్యూఆర్‌ను తరచూ మార్చేసేవారు. ఇది ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా సాంకేతిక సామర్థ్యం, ధరలను అంచనా వేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఇది టెండరింగ్‌పై కూడా ప్రభావం చూపింది. ఫలితంగా డీల్‌ చాలా ఆలస్యమైంది.
* సాంకేతిక అంచనాల నివేదికలో ఆబ్జెక్టివిటీ, ఈక్విటీ, నిలకడగా సాంకేతిక పరిశీలన వంటి అంశాలు నివేదికలో లేవు.
  • కాగ్‌(CAG): Comptroller and Auditor General of India

views: 767



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams