Current Affairs Telugu Daily

గ్రామీణ మార్కెట్ల అభివృద్ధికి త్వరలో రూ.2 వేల కోట్లతో నిధి
దేశంలోని 22 వేల గ్రామీణ వ్యవసాయ సంతలు, 585 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ)ల ఆధునికీకరణకు రూ.2 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ తెలిపారు. లోక్‌సభలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ‘‘ఈ 22 వేల గ్రామీణ సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేస్తాం. ఉపాధి హామీ పథకం, ఇతర పథకాలతో ఈ మార్కెట్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తాం. వీటన్నింటినీ ఈనామ్‌తో అనుసంధానిస్తాం. ఏపీఎంసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తాం. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా టోకు వర్తకులకు విక్రయించే వెసులుబాటు కల్పిస్తాం’’ అని మంత్రి తెలిపారు.
views: 795Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams