Current Affairs Telugu Daily

అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు ముజాదిది కన్నుమూత
సోవియట్‌ యూనియన్‌ బలగాల నిష్క్రమణ తర్వాత తొలిసారిగా అఫ్గానిస్థాన్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన గెరిల్లా నేత సిబ్ఘాతుల్లా ముజాదిది కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. అమెరికాతో ప్రచ్ఛన్నయుద్ధం ముదిరిన సమయంలో సోవియట్‌ బలగాలు(రెడ్‌ ఆర్మీ) అఫ్గాన్‌ను ఆక్రమించాయి. వాటిపై పోరాడిన గెరిల్లా గ్రూపుల్లో ‘అఫ్గాన్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(ఏఎన్‌ఎల్‌ఎఫ్‌)’ ప్రధానమైనది.
అమెరికా మద్దతు గల ఈ ఏఎన్‌ఎల్‌ఎఫ్‌లో ముజాదిది కీలక నేత. రెడ్‌ ఆర్మీ నిష్క్రమించాక 1992లో రెండు నెలలపాటు ముజాదిది దేశాధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తాలిబన్లు దేశాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడంతో ఆయన అఫ్గాన్‌ విడిచి వెళ్లారు. 2001లో అమెరికా బలగాలు తాలిబన్లను అధికారం నుంచి తప్పించిన తర్వాత ముజాదిది తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అఫ్గాన్‌ ప్రస్తుత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన మండలికి ఆయనే నేతృత్వం వహించారు.
  • Afghanistan Capital: Kabul
  • Currency: Afghan afghani
  • President: Ashraf Ghani

views: 763

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams