Current Affairs Telugu Daily

జాతీయ స్థాయి ప్రదర్శనకు ‘ఆక్వాబోట్‌’ నమూనా ఎంపిక
వరంగల్‌లో ఈ నెల 2, 3, 4వ తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రథమస్థానంలో నిలిచిన సూరారం నార్త్‌సిటీ హైస్కూల్‌ విద్యార్థి రూపొందించిన ‘ఆక్వాబోట్‌’ నమూన జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది.
10వ తరగతి విద్యార్థి ప్రేమ్‌కుమార్‌ పాఠశాల ఉపాధ్యాయుడు సాయి సహకారంతో తన సృజనకు పదునుపెట్టి అడినో సాప్ట్‌వేర్‌ ద్వారా ఆక్వా బోట్‌ను రూపొందించి ఆకట్టుకున్నాడని పాఠశాల కరెస్పాండెంట్‌ వెంకటేష్‌ ముదిరాజ్‌ తెలిపారు. మనిషి లేకుండానే ఈ బోటును వినియోగించి నదులు, సరస్సులు, చెరువుల్లో వ్యర్థాలను తొలగించవచ్చు.
చరవాణికి అనుసంధానం చేసి హైదరాబాద్‌లోని హుసేన్‌సాగర్‌ వంటి జలాశయంలో ప్లాస్టిక్‌, ఇతరత్రా వ్యర్థాలను బయటకు తీసేందుకు ఈ ఆక్వాబోట్‌ ఉపయోగపడుతుందన్నారు. వ్యర్థాలు నీటి అడుగుకు చేరకముందే తొలగించే అవకాశం ఉండటంతో భూగర్భ జలాలు కలుషితమవకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ నెల 14, 15వ తేదీల్లో దిల్లీలోని ఐఐటీలో జరగనున్న జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు  ఎంపికైంది

views: 873

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams