Current Affairs Telugu Daily

సీబీఐ మాజీ అదనపు డైరెక్టర్‌ నాగేశ్వర్‌రావుకు అసాధారణ శిక్ష-సుప్రీమ్ కోర్ట్ 

ముజఫర్‌పుర్‌ వసతిగృహ అత్యాచారాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్‌కే శర్మను బదిలీ చేసి సీబీఐ అదనపు డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది.
**ఇందుకు గానూ ఆయనకు న్యాయస్థానం అసాధారణ శిక్ష విధించింది. రూ. లక్ష జరిమానాతో పాటు నేటి కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని ఆదేశించింది.నాగేశ్వర్‌రావుతో పాటు సీబీఐ న్యాయ సలహాదారుకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని గొగొయ్‌ స్పష్టంచేశారు.

ఈ  కేసు దర్యాప్తు నుంచి అధికారులను బదిలీ చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి నాగేశ్వరరావు తాను తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఎస్‌కే శర్మను దర్యాప్తు నుంచి తప్పించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారానికి సంబంధించి నాగేశ్వరరావు నేడు(Feb 12) కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయన తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అయితే ఇందుకు ఆయన ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు కేకే వేణుగోపాల్ న్యాయస్థానానికి విన్నవించారు. 
CBI ప్రస్తుత డైరెక్టర్: Rishi Kumar Shukla


views: 1046

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams