Current Affairs Telugu Daily

‘భారతరత్న’ను తిరస్కరించిన హజారికా తనయుడు 
ప్రఖ్యాత అస్సామీ గాయకుడు భూపేన్‌ హజారికాకు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘భారతరత్న’ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు ఆయన తనయుడు తేజ్‌ హజారికా(67) ప్రకటించారు.
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ పురస్కారాన్ని తిరిగి ఇవ్వాలని తమ కుటుంబం నిర్ణయించుకున్నట్లు అసోంకు చెందిన స్థానిక వార్తా ఛానల్‌తో పేర్కొన్నారు.
ప్రచురణకర్త, రచయిత, ఉపాధ్యాయుడైన తేజ్‌హజారికా ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్నారు. విమర్శలు ఎదుర్కొంటున్న పౌరసత్వ బిల్లు తన తండ్రి భావాలకు వ్యతిరేకమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

views: 916

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams